జయరాం కేసు: చంచల్‌గూడ జైలుకు నిందితులు

జయరాం కేసు: చంచల్‌గూడ జైలుకు నిందితులు

ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు హైదరాబాద్‌ పోలీసులు... ఈ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌... నందిగామ సబ్‌జైలులో ఉండగా... ఇవాళ హైదరాబాద్‌కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. కోర్టు సమయంలో ముగియడంతో జయరాం హత్య కేసులో నిందితులుగా ఉన్న రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ను ఎల్‌బీనగర్‌లోని జడ్జి నివాసానికి తీసుకెళ్లారు. హత్య కేసులో రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌కు ఈనెల 25వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా... అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.