వరల్డ్‌కప్ టీమ్‌ను ప్రకటించిన జర్మనీ

వరల్డ్‌కప్ టీమ్‌ను ప్రకటించిన జర్మనీ

త్వరలో రష్యా వేదికగా జరగనున్న ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టీమ్‌ను ప్రకటించింది జర్మనీ. 23 మందితో కూడిన జర్మనీ టీమ్‌ను కోచ్ జోకిమ్ లో ప్రకటించాడు. గత వరల్డ్‌కప్ లో కీలకపాత్ర పోషించిన గోల్‌కీపర్ మాన్యూల్ న్యూయెర్‌కు జట్టులో చోటు దక్కింది. కాలి ఎముక విరగడంతో గాయపడి ఇన్ని రోజులు టీమ్‌కు దూరంగా ఉన్న  న్యూయెర్‌కు చోటు దక్కడం విశేషం. న్యూయెర్‌తో పాటు గోల్‌కీపర్లు కెవిన్ ట్రాప్, మార్క్ ఆండ్రీ స్టెగెన్‌లను కూడా ఎంపిక చేశారు. ఈ శుక్రవారం జర్మనీ తన చివరి వామప్ మ్యాచ్ ను సౌదీఅరేబియాతో ఆడనుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఎఫ్‌లో జర్మనీ జట్టు ఉంది. ఇదే గ్రూప్ లో స్వీడన్, మెక్సికో, సౌత్‌కొరియాలు ఉన్నాయి. జూన్ 14న  ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభమవనుంది. 

Photo: FileShot