స్పోర్టివ్ తో పాటు ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చాడు..

స్పోర్టివ్ తో పాటు ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చాడు..

నాని జెర్సీ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది.  ఈ టీజర్ లో చాలా అంశాలను టచ్ చేశాడు.  క్రికెట్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది.  కొందరే ఆ గేమ్ ను ఆడేందుకు ఇష్టపడతారు.  అందులో చాలా తక్కువమంది సక్సెస్ అయ్యి దేశానికీ పేరు తీస్తుంటారు.  సక్సెస్ అన్నది మనం మనం చేసే పనిని బట్టి.. వస్తుంది.  

ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఏజ్ 60 సంవత్సరాలుంటే.. స్పోర్ట్స్ కు మాత్రం 30 లేదా 35 సంవత్సరాల వయసులో రిటైర్ అవుతుంటారు.  36 సంవత్సరాల వయసులో క్రికెటర్ కావాలని కలలు కనడం అత్యాశే అవుతుంది.  ప్రయత్నిస్తే ఆశను కూడా సక్సెస్ చేసుకోవచ్చు అనే పాయింట్లో జెర్సీ టీజర్ ను కట్ చేశారు.  టీజర్ సింపుల్ గా సూపర్ అని చెప్పొచ్చు.  సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.