ఝాన్సీ ఆత్మహత్యపై ఆమె తల్లి ఏమన్నారంటే..

ఝాన్సీ ఆత్మహత్యపై ఆమె తల్లి ఏమన్నారంటే..

ప్రేమ వ్యవహారం వల్లే బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  సూర్య అనే యువకుడితో ఝాన్సీ వాట్సాప్ చాట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. 

ఐతే.. ప్రేమ వ్యవహారం గురించి తమకేమీ తెలియదని ఝాన్సీ తల్లి చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఝాన్సీ షూటింగ్‌లకు వెళ్లడం లేదని, చిరాగ్గా ఉన్నదని చెబుతూ ఇంట్లోనే ఉండేదని చెప్పారు. పోలీసులు చెబుతున్న సూర్య ఎవరో తనకు తెలియదని.. ప్రేమ వ్యవహారం, సహజీవనం విషయం కూడా తెలియదని తెలిపారు.

నిన్న రాత్రి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని.. ఆ సమయంలో ఝాన్సీతోపాటు తన కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడని వివరించారు.