శ్రీశాంత్‌ను చెప్పుతో కొట్టిన రోజా...

శ్రీశాంత్‌ను చెప్పుతో కొట్టిన రోజా...

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ దగ్గర జూనియర్ ఆర్టిస్టులు హంగామా సృష్టించారు... సినిమాలో అవకాశాల పేరుతో తనను మోసం చేశాడని జూనియర్ ఆర్టిస్ట్ శ్రీశాంత్‌ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు జూనియర్ ఆర్టిస్ట్ రోజా... తనను పెళ్లిపేరుతో మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన రోజా... పోలీసుల ఎదుటే శ్రీశాంత్‌పై చెప్పుతో దాడి చేసి కొట్టింది. శ్రీశాంత్‌ రెడ్డిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో జూనియర్ ఆర్టిస్టులు వాగ్వాదానికి దిగారు. రోజాను మోసం చేసిన శ్రీశాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ ఆర్టిస్టులు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే.