హెచ్‌సీఏలో న్యాయం గెలిచింది: అజర్‌

హెచ్‌సీఏలో న్యాయం గెలిచింది: అజర్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా వివేక్‌ను తొలగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్‌, హెచ్‌సీఏ సభ్యుడు అజారుద్దీన్‌ అన్నారు. హైకోర్టు తీర్పుతో హెచ్‌సీఏలో న్యాయం గెలిచిందన్నారు. వివేక్‌ ప్యానల్‌ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదని తాము ముందునుంచీ చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు. ఇదే విషయమై తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని అజారుద్దీన్‌ అన్నారు. వివేక్‌పై అంబుడ్స్‌మన్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని రుజువైందని చెప్పారు.