చంద‌మామ‌కు అంత పారితోషిక‌మా?

చంద‌మామ‌కు అంత పారితోషిక‌మా?

చంద‌మామ కాజ‌ల్ గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌పై గుర్రుమీద ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌థానాయిక‌ల‌కు హీరోల‌కు ధీటైన పాత్ర‌లు ఉండ‌వు అన్న‌ది కాజ‌ల్ ఆరోప‌ణ‌. ఖైదీనంబ‌ర్ 150 స‌హా ప్ర‌తి సినిమాలోనూ అదే తంతు. అందుకే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌పై కొంత‌కాలంగా ఈ అమ్మ‌డు సీత‌క‌న్నేసింద‌నే చెప్పాలి. ఆ క్ర‌మంలోనే త‌మిళం, హిందీలో ప్రాధాన్య‌త ఉండే పాత్ర‌ల్ని ఎంచుకుంది. టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎవ‌రైనా త‌న‌తో సినిమా కుదుర్చుకోవాలంటే భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ కావాల‌నే హోల్డ్‌లో ఉంచేది. 

అయితే తాజాగా మ‌రోసారి చంద‌మామ టాలీవుడ్‌లో బిజీ అయిపోతోంది. ప్ర‌స్తుతం `క్వీన్` త‌మిళ రీమేక్ ప్యారిస్ ప్యారిస్‌లో న‌టిస్తున్న కాజ‌ల్ తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాకి సంత‌కం చేసింది. ఈ సినిమాకి  2కోట్ల మేర పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డంతో ఓకే చెప్పింద‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు సంతోష్ శ్రీ‌నివాస్ సినిమాకి సంత‌కం చేసినా దానిపై క్లారిటీ రావాల్సి ఉందింకా. ఇక‌పోతే కొడుకు కోసం ఎంతైనా విసిరేయ‌డానికి టాప్ ప్రొడ్యూస‌ర్‌ బెల్లంకొండ సురేష్ ప‌క్కా ప్ర‌ణాళిక‌లో ఉంటార‌న్న సంగ‌తి విదిత‌మే. బెల్లంకొండ శ్రీ‌ను సినిమాల‌న్నిటిలో స్టార్ హీరోయిన్లే నటించ‌డం వెన‌క భారీ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.