'కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చించేలేదు'

'కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చించేలేదు'

కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం పొత్తులపై చర్చించలేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే పొత్తుల ప్రస్తావన ఉంటుందన్నారు. విభజన కష్టాల నుంచి గట్టెక్కుదామనే లక్ష్యంతోనే బీజేపీతో కలిశామని.. కానీ బీజేపీ మోసం చేసిందని ఆయన అన్నారు. 'బీజేపీయేతర పక్షాలే కాదు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా మోడీ విధానాలపై అసంతృప్తితో ఉన్నాయి. బీజేపీ విధానాలు నచ్చక టీడీపీ ఏ విధంగా బయటకు వచ్చిందో.. అలాంటి ఆలోచనే ఎన్డీఏలోని కొన్ని పక్షాలకూ ఉంది' అని కళా చెప్పారు. మోడీ విధానాలను వ్యతిరేకించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలనూ ఏకతాటి మీదకు తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్న ఆయన.. చంద్రబాబు ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు.