కళ్యాణ్ రామ్ 118 రిలీజ్ డేట్ వచ్చేసింది

కళ్యాణ్ రామ్ 118 రిలీజ్ డేట్ వచ్చేసింది

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నివేతా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా చేస్తున్న సినిమా 118.  సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది.  ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం.  ఈ సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాత మహేష్ కోనేరు కొద్దిసేపటిక్రితమే ప్రకటించారు.  

మార్చి 1 వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారట.  సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ గా సినిమాను తెరకెక్కిందని నిర్మాత పేర్కొన్నాడు.  ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అలాంటి జానర్లో సినిమా చేయలేదని, తప్పకుండా అందరికి ఈ సినిమా నచ్చుతుందని చెప్తున్నాడు నిర్మాత.