వైరల్ అవుతున్న భారతీయుడి ఇల్లు..!!

వైరల్ అవుతున్న భారతీయుడి ఇల్లు..!!

భారతీయుడు సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్.  కమల్ ధరించిన నేతాజీ డ్రెస్ అప్పట్లో బాగా ఫెమస్ అయ్యింది.  భారతీయుడు లాంటి మరో సినిమా వస్తుందా అనే సందేహం అప్పట్లో కలిగింది.  అవినీతిపై ఓ భారతీయుడు సాగించిన పోరాటమే ఆ సినిమా.  అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ సినిమా వచ్చింది.  

ఇప్పుడు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా దానికి సీక్వెల్ భారతీయుడు 2 ను  షూట్ చేస్తున్నారు.  గతనెలలో పొల్లాచ్చి షెడ్యూల్ తో సినిమా ప్రారంభం అయింది.  అక్కడ తెవర్మగన్ అనే ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు.  భారతీయుడు 2 లో కమల్ హాసన్ ఇల్లు అది.  పాత బంగ్లాగా ఉన్న ఆ ఇంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.