టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఇవాళ టీడీపీలో చేరారు. అమరావతిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాండ్రు కమలకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని.. అందుకే టీడీపీలో చేరానని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఆమె అన్నారు.