మోడీ పర్యటనలో కన్నాకు చుక్కెదురు..!

 మోడీ పర్యటనలో కన్నాకు చుక్కెదురు..!

మోడీ ఏపీ పర్యటన ప్రారంభంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చుక్కెదురైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీకి స్వాగతం పలికేందుకు పలువురు నేతలు అక్కడకు చేరుకున్నారు. ఐతే.. కన్నా లక్ష్మీనారాయణను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ కన్నాను అక్కడే ఆపేశారు. తమకు అందిన జాబితాలో పేర్లున్న వ్యక్తులనే తాము అనుమతిస్తామని చెప్పడంతో కన్నాకు షాక్‌ తప్పలేదు.