ప్రధానికి కన్నా డిమాండ్ల చిట్టా..

 ప్రధానికి కన్నా డిమాండ్ల చిట్టా..

ఆంధ్రప్రదేశ్ బీజేపి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీని కలిశారు కన్నా లక్ష్మీనారాయణ. ఈరోజు ఢిల్లీలో భేటీ అయిన కన్నా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీకి ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన 12 అంశాల జాబితాను ప్రధానికిచ్చినట్లుగా కన్నా తెలిపారు. అలాగే త్వరలోనే మరోసారి పార్టీ నుంచి  ఓ ప్రతినిధి బృందం వచ్చి ప్రధానిని కలిసి ఈ అంశాలను త్వరిత గతిన అమలు చేయాలని కోరతామని కూడా కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అలాగే రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో భేటీ కానున్నారు కన్నా లక్ష్మీనారాయణ. అంతేకాకుండా ఆయన నేతృత్వంలో ఏపీకి చెందిన బిజేపి నేతల బృందం కూడా కలవనుంది.