'బాబు ముద్దాయి.. అందుకే నోటీసులు'

'బాబు ముద్దాయి.. అందుకే నోటీసులు'

ప్రజల సానుభూతి కోసమే టీడీపీ డ్రామాలాడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబ్లీ కేసులో ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నోటీసులతో బీజేపీకి సంబంధం లేదన్నారు. 'ఓ ముద్దాయి కోర్టుకు గైర్హాజరైతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారు. 22 వాయిదాలకు కోర్టుకు వెళ్లకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయక ఏం చేస్తారు..?' అని కన్నా ప్రశ్నించారు. చంద్రబాబుకు నోటీసులు వెనుక మోడీ ఉన్నారన్నది అవాస్తవమన్నారు. 2013 నుంచి ఈ కేసు నడుస్తోందని.. అప్పటి నుంచి వారికి నోటీసులు అందుతూనే ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిందన్నారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని కన్నా విమర్శించారు.