ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గు పడుద్ది

ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గు పడుద్ది

ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గు పడుద్ది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు న్యాయ విచారణ కోరే దమ్ముందా? చంద్రబాబుపై విచారణ చేస్తే జైల్ కి వెళ్లడం ఖాయం అని అన్నారు. ఎన్టీఆర్ ను కాకా పట్టి టీడీపీలో చేరిన చంద్రబాబు.. సొంత మామను వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్నాడని విమర్శించారు. ఆంధ్రరాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని చెప్పిన చంద్రబాబు.. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తా అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తులు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. 2014లో నరేంద్ర మోదీ చారిష్మా చూసి బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాదు.. చంద్రబాబుది తెలుగు దేశ డ్రామా కంపెనీ అని కన్నా విమర్శించారు. తెలంగాణ పొత్తులు నాకు సంభందం లేదు అని చెప్తున్న చంద్రబాబు ఓ పార్టీకి జాతీయ అధ్యక్షుడా? తెలుగు ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎల్లకాలం కుదరదు అని పేర్కొన్నారు. అవినీతి భయపెడుతుందన్న భయంతో బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వరు.. మీడియాతో మాట్లాడనివ్వరని ఆయన అన్నారు. ఇసుక దగ్గరనుండి మరుగుడొడ్ల వరకు అన్నింటిలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.