టేపుల కలకలంపై సిట్

టేపుల కలకలంపై సిట్

కర్ణాటక రాజకీయాల్లో ఆడియో, వీడియో టేపులు కలకలం రేపుతున్నాయి. ఆడియో , వీడియో టేపుల విషయంపై సిట్ ను ఏర్పాటు చేయాలని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సీఎం హెచ్.డి. కుమార స్వామిని ఆదేశించించారు. సిట్ విచారణ కూడా 15 రోజులు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు.. ‘ఆపరేషన్‌ కమల్‌’ ఆడియో తనది కాదని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప యూటర్న్ తీసుకున్నారు. ఆ ఆడియో తనదేనని అంగీకరించారు. తన వద్దకు జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణగౌడను కుమారస్వామే పంపి కుతంత్ర రాజకీయాలతో ఆడియో రికార్డు చేయించారని యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడిట్‌ చేసిన ఆడియోను సీఎం విడుదల చేశారని.. పూర్తి ఆడియోను తాను త్వరలో విడుదల చేస్తానన్నారు. అటు... బీజేపీ నేత విజూగౌడ పాటిల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కుమారస్వామి రూ.25 కోట్లు డిమాండ్‌ చేసిన వీడియో బయటకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది.