కర్నాటక కేబినెట్ విస్తరణకు ముహుర్తం

కర్నాటక కేబినెట్ విస్తరణకు ముహుర్తం

కర్నాటక కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. సీఎం హెడి.డి.కుమారస్వామి తన కేబినెట్ ను ఈ నెల 22న విస్తరించనున్నారు.  26 మంది ఉండే తన కేబినెట్ లోకి మరో 8 మందిని చేర్చుకునే అవకాశం ఉంది. ఇందులో 6గురు కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరిని తన సొంత పార్టీ జేడీ(ఎస్) నుంచి  తీసుకోవాలని నిర్ణయించారు.  కేబినెట్ విస్తరణ ఆలస్యం కావటంతో పార్టీలో అసంతృప్తి రగులుతోంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కు తెర దించాలని భావించిన సీఎం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఇరు పార్టీల కోఆర్డినేషన్ కమిటీ మాజీ సీఎం సిద్ధ రామయ్య ఆధ్వర్యంలో భేటీ అయింది.  ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, జేడీ(ఎస్) చీఫ్ దేవెగౌడ, సిద్ధ రామయ్య కలిసి చర్చించిన అనంతరం కేబినెట్ విస్తరణ తేదీని నిర్ణయించారు. దీంతో పాటు అదే రోజు పలు ప్రభుత్వ బోర్డ్స్ , కార్పోరేషన్స్ చెర్మన్ లను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కుమారస్వామి కేబినెట్ లో  ఇది రెండో విస్తరణ. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం మేలో ఏర్పడింది. మొదటి విస్తరణ జూన్ లో జరిగింది.   రెండో విస్తరణ అక్టోబర్ లో చేయాని భావించారు. కానీ అది జరగలేదు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది.