వాలెంటైన్ డే రోజున ఆసక్తికరమైన పోటీ..!!

వాలెంటైన్ డే రోజున ఆసక్తికరమైన పోటీ..!!

ఫిబ్రవరి 14 అందరికి గుర్తుండిపోయే రోజు.  ఆరోజున కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమతో కూడిన సినిమాలు ఎక్కువగా రిలీజ్ చేస్తుంటారు.  ఈ వాలెంటైన్ డే రోజున రెండు డబ్బింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి.  అందులో ఒకటి కార్తీ దేవ్ సినిమా కాగా, రెండో సినిమా లవర్స్ డే.  

కన్నుకొట్టి గూగుల్ ను బుట్టలో పడేసిన మలయాళం బ్యూటీ ప్రియా వారియర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.   సినిమాపై అంచనాలు  భారీగా ఉన్నాయి. కార్తీకి తమిళనాటుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి  ఫాలోయింగ్ ఉంది. ప్రియా వారియర్ కు గ్లోబల్ లో మంచి పేరు ఉంది.  ఈ రెండు సినిమాలు సౌత్ లో పోటీ పడుతుండటం విశేషం.  మరి ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ అవుతుందో చూద్దాం.