నాణెంపై సీఎం

నాణెంపై సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. కేసీఆర్ బొమ్మతో ముద్రించిన నాణేల ఆవిష్కరణ జరిగింది. ఈ నాణేలను స్వయంగా కేసీఆరే ఆవిష్కరించారు. ఓవైపు కేసీఆర్‌ చిత్రాన్ని, మరోవైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించిన ఈ నాణేలను టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ రూపొందించారు. కేసీఆర్‌పైఉన్న అభిమానంతోనే ఈ నాణేలను తయారు చేశామని చంద్రశేఖర్‌గౌడ్‌ చెప్పారు. ఎన్ఆర్ఐల అభివృద్ధి  కేసీఆర్ వల్లే అవుతుందని ఆయన అన్నారు.