కేసీఆర్‌ 'ఓట్ల' కాయిన్స్‌ వస్తాయేమో?

కేసీఆర్‌ 'ఓట్ల' కాయిన్స్‌ వస్తాయేమో?

టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ నాణెములు ముద్రించి ఓటర్లుకు పంచి ఓట్లు దండుకునే అవకాశం ఉంది అని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కే.నారయణ. వరంగల్ అర్బన్ నగరం పోచమ్మమైదనంలో ఈ రోజు చెన్న బోయిన కమలమ్మ, అప్పన్న విగ్రహాలు ఆవిష్కరించారు డా.కే.నారయణ. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ.వెంకట్ రేడ్డి, మాజీ మంత్రి బసవరాజు సారయ్యలు కూడా పాల్గొన్నారు. అనంతరం సీపీఐ నారాయణ మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ నాణెములు ముద్రించి ఓటర్లుకు పంచి.. ఓట్లు దండుకునే అవకాశం ఉంది అని అన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కంటే ప్రమాదమైనది  కేసీఆర్ టెలిపోన్ ట్యాపింగ్ కేసు అని పేర్కొన్నారు. షాబోద్దిన్ ఎన్ కౌంటర్ లో నయిం బ్రతికివుంటే అమిత్ షా జైళుకు వేల్లేవాడు అని తెలిపాడు. కేంద్రంలో మోదీకి అనుకూలంగా ఉన్న అవినీతి పరులను రక్షించడం.. వ్యతిరేకంగా ఉండే వారిపై కేసులు నమెుదు చేయించడానికి మోదీ ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిపారు. మోదీ ప్రభుత్వం మైన్స్ మాఫియా, నేరగాళ్ళకు మద్దతుగా పనిచేస్తుందని విమర్శించారు.