మా అన్నదమ్ములపై కక్ష సాధింపు చర్యలు

మా అన్నదమ్ములపై కక్ష సాధింపు చర్యలు

కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతోందని, తనపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నా తమ్ముడిని చంపుతానని రవీందర్ రావు  బెదిరించారని, ఆ ఫిర్యాదును పక్కన పెట్టిన పోలీసులు మా పైనే కేసులు పెట్టారని ఆరోపించారు. తన వెపన్ ను 2015 పరకాల పోలీస్టేషన్ లో డిపాజిట్ చేశానని, తమ్ముడి వెపన్ కూడా 2015లోనే డిపాజిట్ చేశామని గండ్ర చెప్పారు. ఇప్పుడు తమ ఇద్దరి దగ్గరా వెపన్స్ లేవని, తమను భయపెట్టి, క్యాడర్ ను భయ భ్రాంతులకు గురిచేయాలని కేసీఆర్ చూస్తున్నారని, దీనిపై డీజీపీ తక్షణమే పూర్వాపరాలు పరిశీలించాలన్నారు.