ఉద్యోగులకు సీఎం శుభవార్త చెబుతారా?

ఉద్యోగులకు సీఎం శుభవార్త చెబుతారా?

ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇవాళ భేటీ కానున్నారు. పలు ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ ముగిసన వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశమవుతారు. ఈ సమావేశాలు ముగియగానే  సీపీఎస్‌ రద్దు, బదిలీలు, పదోన్నతులు, ఆర్డర్‌ టు సర్వ్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు శాశ్వత కేటాయింపులు తదితర ప్రధాన డిమాండ్లకు సంబంధించి సీఎం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్ర్టానికి తీసుకురావడం, స్పౌజ్, మ్యూచువల్స్ బదిలీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీవో-14 తదితర అంశాలన్నింటిపై సీఎం స్పష్టమైన ఆదేశాలిస్తారని భావిస్తున్నారు. 11వ పీఆర్సీ ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకునే అవకాశముందని, కమిటీ నియామక విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2న ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.