సావిత్రిగా కీర్తి సురేష్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్.. !

సావిత్రిగా కీర్తి సురేష్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్.. !

ఈ మధ్య భారతీయ సినిమా స్క్రీన్ మీద బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది.  సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు చాలా మంది దర్శక నిర్మాతలు.  ఆ కోవలో వచ్చిన 'మహానటి, సంజు' వంటి చిత్రాలు భారీ విజయాల్ని అందుకోగా ఇప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుగారి జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' అనే చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాను బాలకృష్ణ నిర్మించడమేగాక అందులో ఎన్టీఆర్ పాత్రను కూడా పోషిస్తున్నారు.  టీ టౌన్ లో వినిపిస్తున్న వార్తల మేరకు ఎన్టీఆర్ యొక్క నటనా ప్రస్థానంలో ముఖ్యులైన సావిత్రిగారి పాత్రలో కీర్తి సురేష్, శ్రీదేవిగారి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని వినికిడి.  ఇప్పటికే 'మహానటి' చిత్రంలో సావిత్రిగారి పాత్రను చేసి కీర్తి సురేష్ అందరి మన్ననలూ పొంది ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిగా ఎలా కనిపిస్తుందో చూడాలి.  

దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి, విష్ణు, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, విద్యాబాలన్, నరేష్, సచిన్ కెడ్కర్ వంటి నటీనటులు నటిస్తున్నారు.