మళ్ళీ అదే పాత్రనా కీర్తి..!?

 మళ్ళీ అదే పాత్రనా కీర్తి..!?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఈ నెలలో షూటింగ్ మొదలుపెట్టాలని యూనిట్ భావిస్తోంది.  ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇక క్యాస్టింగ్ విషయాన్ని బాలకృష్ణ దర్శకుడు క్రిష్ కు పూర్తిగా అప్పగించినట్టు సమాచారం.  ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ కూడా ఉందట. 

సావిత్రి పాత్రకోసం కీర్తి సురేష్ ను సంప్రదించారని తెలుస్తోంది.  ఇప్పటికే కీర్తి సురేష్ మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించింది.  ఇదే రోల్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఉంటుందట.  ఎన్టీఆర్, సావిత్రి సినిమాల్లోని హైలైట్ గా నిలిచిన కొన్ని సీన్స్, సాంగ్స్ ను ఈ సినిమాలో వినియోగించనున్నారు.  ఇప్పటికే కీర్తి సురేష్ మహానటిలో సావిత్రి పాత్రను పోషించింది.  ఇప్పుడు ఇదే పాత్రను ఎన్టీఆర్ బయోపిక్ లో పోషిస్తుందా అన్నది సందేహం.  

ఇదిలా ఉంటె, మహానటిలో జెమిని గణేశన్ గా నటించింది దుల్కర్ సల్మాన్ యువకుడు, అలాగే ఏఎన్నార్ గా నటించిన నాగ చైతన్య కూడా యువకుడే.  ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోంది బాలకృష్ణ.  సీనియర్ నటుడు కావడంతో.. బాలకృష్ణ పక్కన సరిపోతానా లేదా అనే ఆలోచనలో పడిందట కీర్తి సురేష్.