సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ

సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ

పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, తగ్గుతున్న రూపాయి విలువ గురించి ఇవాళ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ సాయంత్రం 6.30గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఇందులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. రూపాయి పతనం,తదనంతర పరిణామాల గురించి, రూపాయి మరింత పడిపోకుండా ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రధానికి ఆర్థిక శాఖ అధికారులు వివరించనున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల ధరల గురించి కూడా చర్చ జరగనుంది. ఇవాళ భేటీతో పాటు మరోసారి రేపు కూడా భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ భేటీకి కూడా ప్రధాని అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.