ఇవాళ్టి నుంచి కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్

ఇవాళ్టి నుంచి కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్

నాలుగవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌, రెండో స్వీట్‌ ఫెస్టివల్‌కు తెలంగాణ వేదికగా మారింది. తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 15వ తేదీ వరకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. రేపు ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఫెస్టివల్స్‌ను ప్రారంభిస్తారు. 20 దేశాల నుంచి 42 మంది కైట్ ప్లేయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్స్ సభ్యులు ఈ కైట్‌ ఫెస్టివల్‌కు వచ్చేస్తున్నారు. 

  • స్వీట్ ఫెస్టివల్ లో 22 దేశాలకు చెందిన 1200 రకాల వెరైటీలను ప్రదర్శిస్తారు. 
  • ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. 
  • సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.
  • సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు.