మయాంక్ పెళ్లిలో రాహుల్ సందడి...

మయాంక్ పెళ్లిలో రాహుల్ సందడి...

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ పెళ్లిలో సందడి చేసాడు. ఫీల్డ్‌లో సరికొత్త జుట్టు, గెడ్డంతో యూత్ ను ఆకట్టుకునే కేఎల్ రాహుల్.. తాజాగా సరికొత్త స్టెల్, డ్రెస్సింగ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. కర్ణాటక టీమ్ మేట్ మయాంక్ అగర్వాల్ గర్ల్‌ఫ్రెండ్ ఆషితా సూద్‌ను సోమవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ  పెళ్లిలో వెయిస్ట్ కోట్‌ ధరించి.. తల పాగాతో డిఫరెంట్ లుక్‌లో ఆహ అనిపించాడు రాహుల్. పెళ్లిలో అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ సందడి చేసాడు. అయితే ఈ ఫొటోలు ట్విటర్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ముగిసిన ఐపీఎల్-11 సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన రాహుల్ 54.91 సగటుతో  659 పరుగులు చేసి.. టోర్నీ టాప్ బ్యాట్స్ మెన్ లలో మూడవ స్థానం సంపాదించాడు. విల్లియమ్ సన్, రిషబ్ పంత్ ముందు స్థానాల్లో ఉన్నారు. 

KL Rahul, Shows Off, Style, Cricketer, Wedding, Mayank Agarwal