నాకిది వరల్డ్‌కప్‌ కంటే ఎక్కువ: కోహ్లీ

నాకిది వరల్డ్‌కప్‌ కంటే ఎక్కువ: కోహ్లీ

ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ విక్టరీ తన కెరీర్‌లో ది బెస్ట్‌ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వరల్డ్‌ కప్‌ గెలిచిన సమయంలో తాను జూనియర్‌ అని గుర్తు చేశాడు. ఈ విజయం తమ జట్టుకు కొత్త ఉత్సాహం ఇస్తుందన్న కోహ్లీ.. అత్యుత్తమ ఆటగాళ్లున్న జట్టుకు కెప్టెన్సీ చేయడం గర్వకారణమని అన్నారు. సిరీస్‌ విజయంలో పుజారా కీ రోల్‌ పోషించాడని.. మాయంక్, పంత్‌ కూడా అద్భుతంగా ఆడారని కోహ్లీ అన్నారు. బౌలర్లు కూడా మునుపెన్నడూ లేని విధంగా సత్తాచాటారన్నాడు