మా ఓటమికి కారణమిదే: కోహ్లీ

మా ఓటమికి కారణమిదే: కోహ్లీ

ఆరంభంలో మూడు వికెట్లు కోల్పోవడంతోనే ఓడిపోయామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో 34 పరుగుల తేడాతో భారత్‌ జట్టు పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్ మాత్రం ఆశించిన మేరకు లేదన్నాడు.  రోహిత్ అద్భుతంగా ఆడాడాని, ధోనీ అతడికి అండగా నిలిచాడని ప్రశంసించిన కోహ్లీ.. ధోనీ అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిందన్నాడు. మరో గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఉంటే మ్యాచ్‌ను గెలిచేవారమన్నాడు.