కెప్టెన్‌గా మరో రికార్డు...

కెప్టెన్‌గా మరో రికార్డు...

ఐపీఎల్‌-11లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(48 నాటౌట్‌;28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సీనియర్ బ్యాట్స్ మెన్ గౌతమ్‌ గంభీర్‌ రికార్డును అధిగమించాడు.

ఐపీఎల్‌లో చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్‌ను వెనక్కినెట్టిన కోహ్లీ.. రెండో స్థానంను కైవసం చేసుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ చేసిన పరుగులు 3,525. గంభీర్‌ 3,518 పరుగులతో మూడో స్థానంకి పడిపోయాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ 3,683 పరుగులతో మొదటి స్థానంలో  ఉన్నాడు. రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.