విజయ్ సర్కార్ ఆడియో డేట్ ఫిక్స్

విజయ్ సర్కార్ ఆడియో డేట్ ఫిక్స్

తమిళనాట రజినీకాంత్ తరువాత అంతటి పేరు ఉన్న నటుల్లో విజయ్ ఒకరు.  ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ అనే సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ చేసిన హంగామా అంతాఇంతా కాదు.  ఇప్పటికే సింహభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సర్కార్, దీపావళి పర్వదినం సందర్భంగా విడుదల చేయాలని యూనిట్ ఇప్పటికే నిర్ణయించింది.  రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లు ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నది.  

ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.  సర్కార్ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ను యూనిట్ ఫిక్స్ చేసింది.  గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 న సర్కార్ ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది.  చెన్నైలో ఈ వేడుకను నిర్వహిస్తారు.  ఎక్కడ నిర్వహించబోతున్నారు.. ఎవరెవరు ఈ వేడుకకు హాజరవుతారు అన్న విషయాలను త్వరలోనే వెల్లడిస్తారు.