అలా చేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయం..

అలా చేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయం..

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన  నేతలకు, యువకులకు టికెట్లు ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోమటిరెడ్డి సోదరులు కోరారు. ఇవాళ ఢిల్లీలో అధినేతతో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని రాహుల్‌ దృష్టికి వారు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఇమేజ్ గ్రాఫ్ పెరిగిందని.. ప్రజల్లో పలుకుబడి, మంచి పేరున్న అభ్యర్థులకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని వారు చెప్పారు.