80 నుంచి 90 సీట్లొస్తాయి...

80 నుంచి 90 సీట్లొస్తాయి...

మహాకూటమికి 80 నుంచి 90 సీట్లు వస్తాయని.. లగడపాటి రాజగోపాల్‌ సర్వే నిజమవుతుందని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ 'ఎన్‌టీవీ'తో ఆయన మాట్లాడుతూ వార్‌ వన్‌సైడ్‌గా జరిగిందన్నారు. పోలింగ్‌ శాతం పెరిగిందని... ప్రతిపక్షం గెలుస్తుందని దీని ప్రకారమే చెప్పొచ్చని అన్నారు. మహాకూటమికి 80 నుంచి 90 సీట్లు వస్తాయని.. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి వైదొలిగి వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు.