కొరటాల డైరెక్షన్లో చిరు సినిమా..?

కొరటాల డైరెక్షన్లో చిరు సినిమా..?

వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు కొరటాల శివ 'భరత్ అనే నేను' చిత్రంతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన తదుపరి సినిమా ఎవరితో చేయనున్నాడనే విషయంలో అల్లు అర్జున్ పేరు వినిపించింది కానీ ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తో కాకపోయినా కొరటాల మెగాకాంపౌండ్ లో సినిమా చేయడం ఖాయమని అంటున్నారు. 

నిజానికి ఇప్పటికే కొరటాల.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సివుంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న చిరుని ఇటీవల కలిసిన కొరటాల ఓ స్టోరీలైన్ ను వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో చిరు స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే సినిమాను మొదలుపెట్టే చాన్స్ ఉంది. ప్రస్తుతానికి కొరటాల శివ మూడు నెలల పాటు విరామం తీసుకోనున్నారు.