రాఘవేంద్రరావు కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?

రాఘవేంద్రరావు కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పనిచేసిన అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ కూడ ఒకరు.  వీరిద్దరి కలయికలో 'వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు' లాంటి పలు హిట్ సినిమాలు వచ్చాయి.  అందుకే ఎన్టీఆర్ సినీ కెరీర్లో దర్శకేంద్రుడిది ప్రత్యేక స్థానం.  ప్రెజెంట్ ఎన్టీఆర్ జీవితంపై బాలకృష్ణ, క్రిష్ చేస్తున్న బయోపిక్ సినిమాలో కూడ ఆయన పాత్ర ఉంది.  ఈ పాత్రలో దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ నటించనున్నాడు.  మొదటి హీరోగా పరిచయమైన ప్రకాష్ ఆ తరవాత దర్శకుడిగా కూడ మారారు.  చాన్నాళ్ల తరవాత మళ్ళీ ఇప్పుడు ఆయన తండ్రి పాత్రలోనే నటిస్తుండటం విశేషం.