ఆమె విషయంలో క్రిష్ తప్పు చేశాడా ?

ఆమె విషయంలో క్రిష్ తప్పు చేశాడా ?

బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్న 'కథానాయకుడు' చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో వాస్తవ పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకోవడంలో పెద్ద కసరత్తులు చేశా డు క్రిష్.  చంద్రబాబుగా రానాను, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ వంటి వారిని ఎంచుకుని తన సెలక్షన్ అదుర్స్ అనిపించుకున్న ఆయన శ్రీదేవి పాత్ర విషయంలో మాత్రం పొరబడినట్టు కనిపిస్తున్నారు. 

ఈ పాత్ర రకుల్ ను ఎంచుకుని ఆమెకు 'వేటగాడు' సినిమాలోని ఆకు చాటు పిందె తడిసె పాటలోని శ్రీదేవి గెటప్ వేసి పోస్టర్ కూడ విడుదలచేశారు.  శ్రీదేవి పాత్ర మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు  శ్రీదేవిగా రకుల్ సెట్టవ్వలేదని, కొందరు ఏదో పర్లేదని, ఇంకొందరు క్రిష్ సెలక్షన్లో ఇదే పూర్ ఛాయిస్ అని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.  మరి ఈ అభిప్రాయాల్ని క్రిష్ సినిమాలో పటాపంచలు చేస్తారేమో చూడాలి.