'సిరిసిల్ల నాకు తల్లితో సమానం..'

'సిరిసిల్ల నాకు తల్లితో సమానం..'

తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల గడ్డ తనకు అమ్మతో సమానం అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇవాళ మార్కండేయ శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేత కార్మికులకు రానున్న రోజుల్లో ఇంకా మంచి జరుగుతుందని చెప్పారు. బతుకమ్మ చీరల ఆర్డర్‌ను, ఆర్వీఎం క్లాత్ ఆర్డర్‌ను ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతకముందు సిరిసిల్ల  సిరిసిల్ల పట్టణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.