కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు... టీడీపీకి లీడర్ లేడు...

కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు... టీడీపీకి లీడర్ లేడు...

కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు... టీడీపీకి లీడర్ లేడు అంటూ సెటైర్లు వేశారు తాజా మాజీ మంత్రి కేటీఆర్... రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాభివృద్ధి కళ్లు ఉన్న ప్రతీ ఒక్కరికీ కనిపిస్తుందని... సిరిసిల్ల అభివృద్ధి కేవలం 25 శాతం మాత్రమే జరిగింది, మిగతా పనిని వచ్చే రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్ వల్ల నేతన్నల మొహంలో వెలుగులు చూస్తున్నామన్న కేటీఆర్... రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. నాకు జన్మ నిచ్చింది మా అమ్మ అయితే... రాజకీయ జన్మ నిచ్చింది సిరిసిల్లే నన్న కేటీఆర్... అపెరల్ పార్క్ ద్వారా మహిళాలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ మీద అన్ని పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయని... కేసీఆర్‌ను గద్దె దించుదాం అంటున్నాయని మండిపడ్డ మాజీ మంత్రి... బీజేపీ వాళ్లు పెద్దనొట్ల రద్దుతో ప్రతీ ఒక్కరూ బాధపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తితి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన కేటీఆర్... కాంగ్రెస్ మాటలు అన్ని బోగస్ మాటలని, వాళ్లు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి... గబ్బర్ సింగ్ సినిమా డైలాగులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. నన్ను  మరోసారి గెలిపిస్తే ఇప్పటికన్నా రెండింతల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్... కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో విసిరేయాలంటూ పిలుపునిచ్చారు.