మోడీ సవాల్‌కు కుమారస్వామి కౌంటర్‌

మోడీ సవాల్‌కు కుమారస్వామి కౌంటర్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కౌంటరిచ్చారు. 'హమ్‌ఫిట్‌తోఇండియాఫిట్‌'లో భాగంగా టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మోడీ.. తన ఫిట్‌నెస్‌ వీడియోను ఇవాళ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి కుమారస్వామిని ట్యాగ్‌ చేసి ఛాలెంజ్‌ విసరగా.. ఆయన తనదైన శైలిలో స్పందించారు. యోగా, వ్యాయామం తన దినచర్యలో భాగమేనని అంటూనే.. రాష్ట్రాభివృద్ధి వైపే తన దృష్టంతా అని అన్నారు. ఇందుకు మోడీ సహకారాన్ని ఆశిస్తున్నానని చెప్పారు. 
'మీరు నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఫిజికల్‌ ట్రెడ్‌మిల్‌, యోగా నా దినచర్యలో భాగం. ఫిట్‌నెస్‌ అనేది చాలా ముఖ్యం. అయినప్పటికీ.. మా రాష్ట్ర అభివృద్ధిపైనే నా దృష్టంతా.. ఈ విషయంలో మీ సహకారాన్ని ఆశిస్తున్నాను' అని ట్విట్టర్‌ ద్వారా ప్రధానికి కుమారస్వామి జవాబిచ్చారు.