కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి..?

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. ఉదయం ఫలితాల సరళి చూసి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారాన్ని చేపడుతుందని విశ్లేషకులు భావించారు. జేడీఎస్ సపోర్ట్ అవసరం లేకుండా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే గంటగంటకూ మారిన సమీకరణాల్లో జేడీఎస్‌కు ఎగ్జిట్‌పోల్ ఫలితాల కన్నా ఎక్కువ సీట్లు లభించే అవకాశం ఉండటం.. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్‌కు బీజేపీ ఆమడ దూరంలో నిలిచేట్లు కనిపించడంతో.. కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారాన్ని చేపట్టకుండా ఉండేందుకు గానూ.. ఏకంగా ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్‌కు ఆఫర్ చేసింది. దీనిపై పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ ప్రతిపాదనకు జేడీఎస్ ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.