ప్రయాగరాజ్ లో కుంభమేళా విశేషాలు

ప్రయాగరాజ్ లో కుంభమేళా విశేషాలు

ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా మరో రెండు రోజుల్లో ప్రారంభవ అవుతుంది. ఎల్లుండి మొదటి షాహీ స్నాన్ జరుగుతుంది. కుంభమేళాలో కుంభ నగరం ప్రయాగరాజ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఘన స్వాగతం పలికేందుకు నగరం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. కొందరు భక్తులు కల్పవాసీ సంగం చేరుకుంటున్నారు. గంగా-యమున సంగమంలో మూడు వైపులా భక్తులు తలదాచుకొనేందుకు ఇప్పటికే వేలాది డేరాలను ఏర్పాటు చేశారు. మెరిసిపోతున్న విద్యుద్దీపాల కాంతుల్లో ప్రయాగరాజ్ తళుకులీనుతోంది. ఈ మారు కుంభమేళా 45 కి.మీల పరిధిలో విస్తరించింది. ఇంతకు ముందు వరకు ఇది 20 కి.మీలకే పరిమితమయ్యేది.

- మేళాలో రోజూ 500కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు
- కుంభమేళాకు మొదటసారి అంతర్జాతీయ నిర్వహణ హోదా లభించింది.
- నగరంలో 15 ఫ్లైఓవర్లు-అండర్ బ్రిడ్జిలు, 264 రోడ్లను వెడల్పు చేశారు. 22 పాంటూన్ వంతెనలు నిర్మించారు. 
- 1.22 లక్షల బయో టాయిలెట్లు, 1300 హెక్టార్లలో 94 పార్కింగ్ లు ఏర్పాటు చేశారు. 20,000 డస్ట్ బిన్ లు ఉంచారు.
- షటిల్ బస్సులు, ఈ-రిక్షాలు నడుపుతున్నారు. వివిధ బ్యాంకులు 40 ఏటీఎంలు పెట్టాయి.
- 10,000 మంది భక్తులు బస చేసేందుకు వీలుగా గంగా, 4 ఇతర పండాల్ లు ఏర్పాటు చేశారు.

కుంభమేళా 2019 మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి