లగడపాటి లెక్క ఇదీ...!

లగడపాటి లెక్క ఇదీ...!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగియడంతో... వరుసగా ఎగ్జిల్ పోల్స్ వెలువడుతున్నాయి... ఇక తెలంగాణ రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేకు ఉన్న క్రేజీ వేరు... ఆయన ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారా? అని అంతా ఎదురుచూస్తుండగానే కాసేపటి క్రితమే ఆయన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు. గతం కంటే తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది... డబ్బు ప్రభావం ఉండబోదనుకున్నాం... కానీ, ఈ సారి డబ్బు ప్రభావం కూడా పెరిగిందన్నారు. ఇరువైపులా ప్రలోభాలు, హామీలతో ప్రజల్లో ఇటు టీఆర్ఎస్, అటు కూటమిపై ప్రేమ, కసి, జాలి... అన్ని కనిపించాయన్నారు లగడపాటి. కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమికి 65 స్థానాలు వస్తాయని... మరో 10 స్థానాలు పెరగొచ్చు... తగ్గే అవకాశం కూడా ఉందన్న లగడపాటి... కూటమిలోని టీడీపీ పోటీచేసిన 13  స్థానాల్లో ఇద్దరు స్వతంత్రులు గెలుస్తారని... మరోచోట ఎంఐఎం పోటీలో ఉండగా... మిగతా 12 స్థానాల్లో టీడీపీ-టీఆర్ఎస్ మధ్య పోటీపోటీ ఉంటుందని... ఇందులో 7 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది... మరో రెండు స్థానాల్లో గెలవొచ్చు... ఓడే అవకాశం కూడా ఉందని అంచనా వేశారు. ఇది చాలా క్లిష్టమైన సర్వేగా అభివర్ణించారు లగడపాటి రాజగోపాల్... మూడు నెలల పాటు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని... వివిధ రకాలుగా ప్రజల నాడిని తెలుసుకున్నాం... చివరకు మాకు వచ్చిన అంచనా ఇదంటూ ఫలితాలను ప్రకటించారు. 

లగడపాటి ఎగ్జిల్ పోల్ సర్వే ఫలితాలు:
కాంగ్రెస్ కూటమి - 65 (ప్లస్ ఆర్ మైనస్ 10)
టీఆర్ఎస్ - 35 (ప్లస్ ఆర్ మైనస్ 10)
బీజేపీ  - 7 (ప్లస్ ఆర్ మైనస్ 2)
ఇండిపెండెంట్లు 7 (ప్లస్ ఆర్ మైనస్ 2)
ఎంఐఎం -    6 -7
బీఎల్‌ఎఫ్‌ (సీపీఎం) - 1