మళ్ళీ ఆమెనే తీసుకున్న వర్మ

మళ్ళీ ఆమెనే తీసుకున్న వర్మ

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు లిరికల్ సాంగ్స్ ను వర్మ ఇప్పటికే రిలీజ్ చేశారు.  మొదటి సాంగ్ వెన్నుపోటు ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన వర్మ, రెండో సాంగ్ ఎందుకు అని ప్రశ్నిస్తూ నిజాలను నిర్భయంగా బయటపెడతాని చెప్పకనే చెప్పాడు.  

సినిమా చేస్తున్నారు అనే విషయం తెలుసుగాని, అందులో క్యాస్టింగ్ ఎవరు, లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం బయటకు రాలేదు.  కొద్దిసేపటి క్రితమే వర్మ లక్ష్మి పార్వతి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. లక్ష్మి పార్వతిగా యజ్ఞ శెట్టి నటిస్తోంది.  గతంలో వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో ముత్తులక్ష్మిగా యజ్ఞ శెట్టి నటించింది.  మరలా ఆమెనే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి పాత్ర కోసం ఎంచుకున్నారు.  అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని ఎందుకు సాంగ్ లో వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.