రవితేజ మరొక అపరిచితుడ్ని చూపిస్తాడా !

రవితేజ మరొక అపరిచితుడ్ని చూపిస్తాడా !

మాస్ మహారాజ రవితేజ చేస్తున్న కొత్త సినిమా 'అమర్ అక్బర్ ఆంథోనీ'.  శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమాలో రవితేజ అమర్, అక్బర్, ఆంథోనీ అనే మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.  మొదట్లో ఈ మూడు పాత్రల్లో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తారని, కథలో ముగ్గురు రవితేజలు ఉంటారని అనుకున్నాం. 

కానీ తాజా సమాచారం సినినిమాలో ఉండేది ఒక్క రవితేజ మాత్రమేనని, అతనే ముగ్గురిగా బిహేవ్ చేస్తుంటాడని, అంటే శంకర్, విక్రమ్ ల 'అపరిచితుడు' మాదిరిగా సినిమా స్ప్లిట్ పెర్సనాలిటీ డిసార్డర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.  మరి ఈ వార్త ఎంత మేరకు నిజమో తెలియాలంటే అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే.