ఎమ్మెల్సీల అనర్హత వేటుపై విచారణ మొదలు

ఎమ్మెల్సీల అనర్హత వేటుపై విచారణ మొదలు

పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలన్న టీఆర్ఎస్ ఫిర్యాదుపై తెలంగాణ శాసనమండలి చైర్మెన్ విచారణ మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును మండలి చైర్మెన్ రిజర్వులో పెట్టారు. రేపు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, యాదవరెడ్డి పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ మండలి ఛైర్మన్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

భూపతిరెడ్డి, కొండా మురళి, యాదవరెడ్డి, రాములు నాయక్‌లు ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. అధిష్టానంపై తిరుగు బావుటా ఎగురవేశారు. దీంతో నలుగుర్ని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్  చేశారు. భూపతిరెడ్డి, కొండా మురళి, రాములు నాయక్‌లు కాంగ్రెస్‌లో చేరారు.