ఇక్రిశాట్‌లో చిరుత కలకలం..

ఇక్రిశాట్‌లో చిరుత కలకలం..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో చిరుతు సంచారం కలకలం సృష్టిస్తోంది. గత నాలుగు రోజులుగా ఇక్రిశాట్‌లో చిరుత సంచరిస్తున్న విషయాన్ని గమనించారు సిబ్బంది. ఇక నిన్న రాత్రి సీసీ కెమెరాలో కూడా చిరుత కదలికల దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో భయంతో వణికిపోతున్నారు ఇక్రిశాట్ సిబ్బంది. ఇక్రిశాట్ చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక చిరుత భయానికి ఇక్రిశాట్‌లో కూలి పనులు చేసే దాదాపు 350 మంది పనులు మానేశారు. మరోవైపు ఇక్రిశాట్ లో ఒక బోనును ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.. మరో రెండు బోనులను మెదక్ నుండి తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, ఇక్రిశాట్‌లో చిరుత సంచారం కొత్తకాదు. గతంలో 2014లో సైతం ఇక్రిశాట్ లో చిరుతను పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు.