మెస్సీ హ్యాట్రిక్‌.. అర్జెంటీనా విజయం

మెస్సీ హ్యాట్రిక్‌.. అర్జెంటీనా విజయం

బార్సిలోనా సూపర్ స్టార్ లియోనెల్‌ మెస్సీ హ్యాట్రిక్‌ గోల్స్ తో మెరిశాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ లో భాగంగా హైతీ, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సీ తనదైన స్టయిల్లో గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. బుధవారం హైతీ జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో 17వ నిమిషంలో తొలి గోల్‌ చేసాడు మెస్సి. ఇక రెండో భాగంలో 58 నిమిషం, 68 నిమిశాలలో రెండు గోల్స్‌ చేశాడు. మరోవైపు అర్జెంటీనా ఆటగాడు అగ్యురో 69వ నిమిషంలో గోల్‌ సాధించడంతో.. అర్జెంటీనా 4-0 తేడాతో హైతీపై విజయం సాదించింది. మొత్తం 124వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 64 గోల్స్ చేసాడు మెస్సీ. సన్నాహక మ్యాచ్‌లో మెస్సీ విజృంభించడంతో.. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ లో పాల్గొనే ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు.

Photo: FileShot