వైరల్ వీడియో: బీఎస్ఎఫ్ జవాన్ ‘సందేశే ఆతే హై’

వైరల్ వీడియో: బీఎస్ఎఫ్ జవాన్ ‘సందేశే ఆతే హై’

దేశ భద్రత కోసం తమ కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో నిర్విరామంగా గస్తీ కాస్తున్నారు మన వీర జవాన్లు. దేశాన్నే తమ ఇల్లుగా భావిస్తారు భారత సైనికులు. అనేక నెలల పాటు కేవలం ఫోన్ సంభాషణలతోనే తమ వారికి దగ్గరగా ఉంటారు. ఇంటికి వచ్చేది ఏడాదిలో కొద్ది రోజులు. కొన్నిసార్లు ఫోన్లు, ఇంటికి రావడం కూడా ఉండవు. అలాంటపుడు వారు 1997లో విడుదలైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘బోర్డర్’ చిత్రంలోని ‘సందేశే ఆతే హై’ పాటతో పూర్తిగా కనెక్టవుతారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది. కొన్ని వందల సార్లు షేరైన ఈ వీడియోలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ ‘సందేశే ఆతే హై’ పాటలను పాడుతూ కనిపిస్తాడు. అతను పాడుతుంటే చుట్టూ యూనిఫామ్ లో ఉన్న ఇతర సహచరులు, సిబ్బంది, అధికారులు సైతం చప్పట్లు చరుస్తూ అతనిని ఉత్సాహపరుస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నానన్న బాధ ఆ జవాన్ కళ్లలో, గొంతులో స్పష్టంగా చూడవచ్చు. చక్కటి గొంతుతో శ్రావ్యంగా ఆ సైనికుడు పాట పాడాడు.