తాత్కాలిక బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం

తాత్కాలిక బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం

ఫిబ్రవరి 1న  2019-20 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ను లోక్ సభ ఆమోదించింది. బడ్జెట్ ను తాము ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బడ్జెట్ లో రూ.75,000 కోట్ల మేర రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకం ఉత్త డొల్ల అని కాంగ్రెస్ విమర్శించింది. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్నస్థాయి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 100% మినహాయింపు ఇచ్చారు. 

ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఇవాళ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ కేటాయింపు బిల్లు మరియు ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి సమాధానం తర్వాత ఈ రెండు బిల్లులను మూజు వాణి ఓటుతో ఆమోదించారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని, బడ్జెట్ లో అందరి సంక్షేమాని దృష్టిలో ఉంచుకొని తయారు చేసినట్టు పీయూష్ గోయల్ తెలిపారు.