నల్ల చొక్కాతో లోకేష్‌.. మోడీపై ఫైర్‌

నల్ల చొక్కాతో లోకేష్‌.. మోడీపై ఫైర్‌

ఏపీలో ప్రారంభోత్సవాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వానాలు పంపలేదని.. ఏదో పిలవాలి అన్నట్టు ఓఎస్‌డీతో కబురుపెట్టారని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇవాళ ఆయన నల్ల చొక్కా వేసుకుని తిరుపతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ మోడీ ఏపీ వచ్చి ఏమిచ్చామని చెబుతారని ప్రశ్నించారు. మోడీ, జగన్‌ ఒక్కటేనని మరోసారి రుజువైందని.. మోడీ సభకు కార్యకర్తలను, ఫ్లెక్సీలను జగన్‌ పంపించారని ఆయన ఆరోపించారు.